బాణసంచా దుకాణదారులు నిబంధనలు పాటించాలి.

 

తూప్రాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగా కృష్ణ

మెదక్ తూప్రాన్ అక్టోబర్ 28 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని పట్టణంలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే బాణసంచా దుకాణదారులు తప్పనిసరిగా సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకోవాలని తూప్రాన్ (సీఐ) సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగా కృష్ణ తెలిపారు. తూప్రాన్ సర్కిల్ పరిధిలో దీపావళి సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా అనుమతి లేకుండా బాణసంచా ఇళ్లల్లో షాపులలో జన సముదాయాల మధ్య గోదాములలో నిల్వ చేసిన లేదా లైసెన్స్ లేకుండా అనధికార విక్రయాలు జరిపిన, అదే విధంగా బాణసంచా విక్రయించే దుకాణదారులు పోలీసుల సూచనలు,నియమ నిబంధనలను పాటించకపోయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ,లైసెన్స్ కలిగిన వారు దీపావళి సామాగ్రి ఉన్న ప్రదేశాలలో ఫైర్ సేఫ్టీ కచ్చితంగా పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘించిన అటువంటి వారిపై పై అధికారుల ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking