జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసిన ట్రైనీ అధికారులు
ప్రజాబలం-తూప్రాన్ న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో గత మూడు రోజులుగా ట్రైనీ కలెక్టర్లు, ఐపీఎస్ లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సోమవారం రోజున కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.తూప్రాన్ మున్సిపల్ లో పర్యటించి పలు శాఖల పనితీరు, విధివిధానాలను పరిశీలించి వివరాలను సేకరించారు. మూడు రోజుల పర్యటనలో 10 మంది ట్రైనీ కలెక్టర్లు,ఐపీఎస్ అధికారులు మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించి పలు కార్యాలయాలు సందర్శిస్తూ అధికారులతో మాట్లాడుతూ వివరాలను సేకరించారు.వీరికి మున్సిపల్ అధికారులు,వివిధ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో సహకరించారు.మున్సిపాలిటీలో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని వెళుతున్న అధికారులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వంలోని వివిధ శాఖల పనితీరుపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ట్రైని కలెక్టర్లు,ఐపీఎస్ లకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపాలిటీ
చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్, కమిషనర్ ఖాజా మొయినుద్దీన్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య,కౌన్సిలర్ లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.