ప్రజాబలం-తూప్రాన్ న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ నూతన మున్సిపల్ కమిషనర్ గా పి.గణేష్ రెడ్డి నియామకమయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారి గణేష్ రెడ్డిని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఖాజా మొయినుద్దీన్ ను బదిలీ చేశారు. కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ కు ప్రమోషన్ లిస్టులో రిజర్వుల్లో ఉంచారు. నూతన మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి త్వరలో బాధితులు స్వీకరించనున్నారు.