.
77 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 46 డివిజన్లో స్థానిక పతంగుల జెండా వద్ద మున్సిపల్ కార్పొరేటర్ వంగల శ్రీదేవి పవన్ కుమార్ మంగళవారం నాడు జాతీయ జెండాను ఎగరవేశారు. మొదట గాంధీజీ చిత్రపటానికి పూలమాల కొబ్బరికాయ కొట్టినారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆగష్టు 15,1947 బ్రిటీష్ పాలకుల నుంచి భరతమాతకు విముక్తి కలిగిన ఈ రోజు. ఎంతో మంది త్యాగాల ఫలితమే భారత స్వాతంత్య్రమన్నారు. భారత్ మాతాకీ జై, బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ పలువురు నినాదాలు చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ సెక్రెటరీ కొత్త ప్రకాశ్, కరీంనగర్ జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు కడారి శివప్రసాద్, , పెందొట రాజు, శ్రీరామోజు వేణు గోపాల్, దేవరకొండ కృష్ణ, సురేష్, రవీందర్, భునాత్ రమేష్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ గావించారు.