తూప్రాన్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

శఫర్డ్‌ స్వచ్ఛంద సంస్థ అధినేత రోయ్యురి సురేశ్‌ సౌజన్యం తో మ్యాగీ మసాలా, పతంజలి బిస్కెట్లు పంపిణీ
తుప్రాన్‌ ప్రజాబలం ప్రతినిధి: తూప్రాన్‌, ఆగస్ట్‌, 15. సేవలో ఉన్న తృప్తి మరెందులో ఉండదని, మానవజన్మ ఎత్తినందుకు ఉన్నదాంట్లో నుంచి ఒక్క శాతం పది మందికి పంచితే జన్మ సార్ధకం అవుతుందని డిస్ట్రిక్ట్‌ చైర్మన్‌ లయన్‌ జానకిరామ్‌ అన్నారు. 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తూప్రాన్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్వర్యంలో, శఫర్డ్‌ స్వచ్ఛంద సంస్థ అధినేత లయన్‌ రోయ్యూరి సురేశ్‌ సౌజన్యం తో మంగళవారం ఉదయం డబుల్‌ బెడ్‌ రూం 36వ బ్లాక్‌ లో మాల్డారు కాయితిబాపని శివ నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్‌ చైర్మన్‌ లయన్‌ పళ్లేర్ల రవీందర్‌ గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూప్రాన్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్వర్యంలో అందజేసే ఈ చిన్న ప్రయత్నం ఎందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. మ్యాగీ మసాలా తో పాటు బిస్కెట్‌ ప్యాకెట్‌, నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిల్లు పండ్లు,బ్రెడ్లు, పంపిణీ చేసే భాగ్యం కల్పించడంపై రోయ్యురీ సురేశ్‌ కు కృతజ్ఞతలు తెలిపారు.
తూప్రాన్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తూప్రాన్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు వంగ భాస్కర్‌ రెడ్డి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వెన్నెల జండాను ఎగురవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం సుష్మా హాస్పిటల్‌ లోని రోగులకు బిస్కెట్లు, మ్యాగీమసాలా,పండ్లు, బ్రేడ్లు, విద్యార్థులకు నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిల్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్‌ లేడీ డాక్టర్‌ సుష్మాదేవి, డాక్టర్‌ ప్రదీప్‌ సిహ్మా, డిస్ట్రిక్ట్‌ చైర్మన్‌ లయన్‌ పల్లేర్ల రవీందర్‌ గుప్త, డిస్ట్రిక్ట్‌ చైర్మన్‌ లయన్‌ జానకిరామ్‌, ప్రెసిడెంట్‌ వంగ భాస్కర్‌ రెడ్డి, సెక్రెటరీ జనరల్‌ కొక్కొండ శశి భూషణ్‌ రెడ్డి, ట్రెజరర్‌ లయన్‌ పుట్ట వెంకటేష్‌, లయన్‌ పెల్లేర్ల బాలేష్‌ గుప్త, లయన్‌ యే%శీ%గలి సత్యనారాయణ, లయన్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking