మహనీయుల పోరాట ఫలితమే స్వాతంత్ర దినోత్సవం

 

టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నరేందర్

మెదక్ : మహనీయుల పోరాట ఫలితమే ఈరోజు 77 స్వతంత్ర దినోత్సవం అని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు, మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో పతాకావిష్కరణ గావించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు, జిల్లాలోని అన్ని వర్గాల ఉద్యోగులకు 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహనీయుల పోరాటాలను స్మరించుకొని వారి నుంచి స్ఫూర్తి పొంది విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తూ సంఘ కార్యకలాపాల్లో క్రియశిలక పాత్ర పోషిస్తూ దేశభక్తిని పెంపొందించుకొని జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ యేసయ్య, కార్యనిర్వాక ఇంజనీర్ లు శ్రీనివాసరావు, కీమా నాయక్ టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ, జిల్లా ఉపాధ్యక్షులు ఇక్బాల్ బాషా, కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, డిప్యూటీ ఈ ఈ శివ నాగరాజు, ఏ ఈ ఈ లు శ్రీహరి గౌడ్, విజయ్ ఉద్యోగులు సలీం, సంతోష్, కృష్ణ, హర్ష, రేణుక, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking