మహనీయుల పోరాట ఫలితమే స్వాతంత్ర దినోత్సవం

 

తూప్రాన్ మండల ఎమ్మార్వో
జ్ఞాన జ్యోతి

మెదక్ తూప్రాన్ 15 ఆగష్టు ప్రజా బలం న్యూస్ :-

మహనీయుల పోరాట ఫలితమే ఈరోజు 77 స్వతంత్రం దినోత్సవం తూప్రాన్ మండల ఎమ్మార్వో జ్ఞాన జ్యోతి అన్నారు. మంగళవారం నాడు మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పతాకావిష్కరణ గావించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు, జిల్లాలోని అన్ని వర్గాల ఉద్యోగులకు, దేశ ప్రజలకు 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహనీయుల పోరాటాలను స్మరించుకొని వారి నుంచి స్ఫూర్తి పొంది విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తూ సంఘ కార్యకలాపాల్లో క్రియశిలక పాత్ర పోషిస్తూ దేశభక్తిని పెంపొందించుకొని జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు,.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండల డిప్యూటీ తాసిల్దార్,
ఆర్ ఐ నాగరాజు , సీనియర్ అసిస్టెంట్ సంపత్, రెవెన్యూ సిబ్బంది నాగలక్ష్మి , నాగభూషణం, బుడ్డ అంజి, రమేష్ , తూప్రాన్ మండల మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking