ఫుడ్ సేఫ్టీ మాట దేవుడెరుగు
పండగ వేళల్లో నాసిరకం ప్రసాదాలేనా..
ఫుడ్ సెఫ్టీ అధికారుల పనితీరిది
జగిత్యాల, ఫిబ్రవరి 17, (ప్రజాబలం ప్రతినిధి): నాసిరకం ఆహార పదార్థాలను ప్రజలకు దూరం చేసిన నాణ్యతా ప్రమాణాలతో కూడిన తినుబండారాలను అందించాల్సిన జిల్లా ఫుడ్ సెఫ్టీ అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. పండుగల వేళల్లో ప్రజలకు నాణ్యమైన ప్రసాదాలను అందించేలా తనిఖీలు చేసి లైసెన్సులు జారిచేయాల్సిన బాధ్యత ఉన్నా ఏ ఆలయంలోను జారీ చేయక ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన సంఘటన ఇది. జగిత్యాల జిల్లా ఏర్పాటు కాక ముందు ఉమ్మడి జిల్లాలోనే ఆహార తనిఖీ విభాగం ఉండేది. ఆకాలంలో ఇదో శాఖ ఉందన్న సమాచారమే ప్రజలకు కరువైంది. ఏటా తప్పకుండా వచ్చే మాముళ్ళతో కుర్చీ వదలక, కదలక విధులను నిర్వర్తిస్తూ వచ్చారు. జిల్లాల ఏర్పాటుతో జగిత్యాల జిల్లాలో ఆహార కల్తీ నిరోధక విభాగం ఏర్పాటు జరిగిన నామమాత్రపు విధులకే పరిమితమయ్యాయి. ఇటీవలే వర్తక సంఘంలో మీడియాకు సమాచారమే ఇవ్వకుండా కొందరికి ఫుడ్ సెఫ్టీ లైసెన్సులు జారిచేసి చేతులు దులుపుకొన్నట్లు తెలిసింది. ఇక పండుగలకు ముందే దేవాలయంలోని ప్రసాదాలను తనిఖీ చేసి నాణ్యమైన సరుకులతో ప్రసాదాలను తయారు చేయాలని సలహా సూచనలు చేసి ఫుడ్ సెఫ్టీ లైసెన్స్ జారీ చేయాల్సి ఉంటుందన్న సమాచారం. కాగా మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయాల్లో ప్రజల సౌకర్యార్టం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇదే తరహాలో ఉపవాస దీక్షతో, నిష్ఠతో శివుణ్ణి పూజించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.

ఇక ఆలయంలోని ప్రసాదాల నాణ్యతపై భరోసా కల్పించ లేని దిశలో ఫుడ్ సెఫ్టీ అధికారులు ఉండగా ఉపవాస ధీక్షలో వుండే భక్తుల ఆరోగ్య పరిస్థితిపై బోలెడు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రికి ముందే ఫుడ్ సెఫ్టీ అధికారులు ఆలయాలలో తనిఖీలు చేసి ఫుడ్ సెఫ్టీ సర్టిఫికెట్లు జరిచేస్తే భక్తులు మరింత సంతోషంగా పండుగను జరుపుకొనేవారన్న చర్చ జరుగుతోంది. ఇక ఆలయాలను మాట అటుంచితే ఆలయాలకు ముందు విక్రయించే తినుబండారాల నాణ్యతపై బోలెడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శివుణ్ణి దర్శించుకోని సరదాగా గడుపుదామని కుటుంబాలతో సహా ఆలయాలకు వచ్చే భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు, తినిబండరాలను అందించేలా ఆసుపత్రుల పాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులపై ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు.