జగిత్యాల, ఫిబ్రవరి 17: భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా నూతన పరిశోధన, విధాన విభాగం జగిత్యాల జిల్లా కన్వీనర్ గా వేముల కరుణాకర్ రెడ్డిని జిల్లా అధ్యక్షులు కోడిపేల్లి గోపాల్ రెడ్డి నియామకము చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ధర్మపురి మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి కిసాన్ మోర్చాలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న నేపథ్యంలో బిజెపి కిసాన్ మోర్చా మరింత బలోపేతానికి కృషిచేస్తారని, నూతన విధానాలను వివరిస్తూ బిజెపి బలోపేతానికి తోడ్పడుతుందని ఈ నియామకాన్ని చేపట్టడం జరిగిందని గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తన నియామకానికి కృషిచేసిన జిల్లా అధ్యక్షులు కోడిపెళ్లి గోపాల్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి, ఎంపీ అర్వింద్, జిల్లా అధ్యక్షులు మొరపెల్లి సత్యనారాయణ రావు, రైతు నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డిలకు ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ క్యాతం దశరథ రెడ్డి, రూరల్ అద్యక్షులు నరసింహారెడ్డి, మ్యాకల మల్లేష్ యాదవ్, కొట్టాల మోహన్ రెడ్డి, బందెల మల్లన్న, కొల నారాయణ