– అటవీ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారితో ఫారెస్ట్ అధికారుల సమీక్ష సమావేశంలో
పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 15 : ఈ రోజు బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పై సమీక్షా సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు , ఈ సందర్భంగా మాట్లాడుతూ పోడు భూములకు శాశ్వతమైన పరిష్కారం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నాది అని అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఏళ్ళుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్న నేపథ్యంలో ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాల్లో పోడు భూముల సమస్యను లేవనెత్తి, కచ్చితమైన పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల విషయంలో అటవీశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అటవీ భూములను కాపాడుకుంటూనే, పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా పోడు భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టి వారికి ప్రయోజనాలను కలిగించాలని కోరారు.