విద్యార్థులకు చేయూత నిస్తున్న వీ ఆర్ 4సాహ్యోగ్ చారిటబుల్ ట్రస్టు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 జూన్ 2024:
శనివారం 15-06-2024 ఉదయం 11 గంటలకు వీ ఆర్ 4 సహ్యోగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మణికొండ జిల్లా పరిషద్ హై స్కూల్ ఆవరణలో స్కూల్ ప్రధానోపధ్యాయులు నిరంజన్ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశానికి ముఖ్య అతిథిగా థి సిటిజన్స్ కౌన్సిల్’ అధ్యక్షుడు ధూళిపాళ సీతారామ్ హాజరై రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండల్ లోనే చదువుల తల్లి సరస్వతీ దేవి కరుణా కటాక్షాలు పొందడంలో ప్రఖ్యాతి గాంచిన మణికొండ జిల్లా పరిషద్ హై స్కూల్ నుండి ఈ సంవత్సరం 176 మంది (86. 27 శాతం) విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణులు కాగా అందులో 18 మంది విద్యార్థులు 90 నుండి 100 కి 100 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయినారని రాబోయే తరుణంలో కనీసం 36 మంది విద్యార్ధులు అధిక శాతంలో ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని, పైన తెలిపిన 18 మంది విద్యార్థులకు వీ ఆర్ 4 సహ్యోగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరు కానుకలతో కూడిన అభినందన మందారమాల దృవీకరణ పత్రాలు పెద్దలందరి సమక్షంలో అందజేస్తూ రాబోయే సంవత్సరము ఇంతకు ఇంతై వటుదింతయి పరీక్షలలో ఉత్తీర్ణులై స్కూల్ పేరు విజయం పథంలో ఉంచాలని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తూ ఇప్పటికే ఇద్దరు విద్యార్థుల పైచదువులకు ట్రస్ట్ తోడ్పడూ తున్నదని, ఈ రోజు ఇంకను ముగ్గురు విద్యార్థినిలు వారి వారి తల్లి దండ్రులతో కలసి పై చదువులకు తోడ్పడమని కోరగా ట్రస్ట్ సభ్యుల అభిప్రాయాలు సేకరించి తప్పకుండా వారికి సహాయ సహకరాలు అందించగలమని చెప్పడం జరిగినదని, విద్యార్థులకు సాయంకాల సమయానికి తిను బండారాలను ఆ సమయంలో సహకరించిన సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ధూళిపాళ సీతారామ్ దంపతులను, గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ వయోజన సభ్యులను, స్కైలా గేటెడ్ కమ్యూనిటీ వయోజన సభ్యులను, చలివేంద్రాలను కొనసాగించడానికి సహకారా లందిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు నిరంజన్ ను, మధుసూదన్ భాయ్ మసరాని లను సముచితంగా సత్కరించుకోన్నామని, అనివార్య కారణాల వల్ల హాజరు కానీ దాతలకు స్వయంగా అందజేస్తామని తెలియపరుస్తూ, ఈ శుభ సందర్భంగా వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ మణికొండ వారు ఇద్దరు విద్యార్థులకు 10,116 రూపాయల నగదు పురస్కారం అందజేసారని, వాసవి సంస్థ అధ్యక్షుడు యాదగిరితో పాటు రామలింగం, గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ వయోజన సభ్యులు, స్కైలా గేటెడ్ కమ్యూనిటీ వయోజన సభ్యులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వీ ఆర్ 4 సహాయోగ్ చారిటబుల్ ట్రస్ట్ కోశాదికారి దిలీప్ కక్కడ్, నిర్మల్ చంద్ గొలెచా, రచ్చా శ్రీనాథ్, తబ్రేజ్ హుస్సేన్, మోహన్ కుమార్, నారోత్తం సింగ్, రమ్య లు హాజరైనారని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ జేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking