అసాంఘిక శక్తులకు దూరముగా ఉంటూ మంచిని మార్గం ఎంచుకొని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలి
పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 15 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల చెన్నూరు రూరల్ సర్కిల్ కోటపల్లి,నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని యూత్ యువకులకు,ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నది మీకోసం మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోసం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్,కోటపల్లి ఎస్సై రాజేందర్,నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో “పోలీస్ మీ కోసం” కార్యక్రమం కోటపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసి యువకులకు చెడు అలవాట్లు వలన కలుగు నష్టాలు,విద్య, ఉద్యోగ సాధనకు చేయవల్సిన కృషి,సైబర్ క్రైమ్స్,ట్రాఫిక్ రూల్స్,తదితరుల విషయాలపై కళా బృందం పాటలతో అవగాహనా కల్పించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్, మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపిఎస్ ముఖ్య అతిథులుగా హాజరై యువత భవిష్యత్తుపై దిశా నిర్దేశం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… యువత ఒక లక్ష్యం ను ఎంచుకొని ఎన్నో విజయాలను సునాయాసంగా అందుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.అంతటి శక్తి యువతకి ఉంది అన్నారు. పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నది మీకోసం మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోసం మీతో మమేకమయ్యామని,ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు.గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితులు సౌకర్యాలు ఎన్నో మెరుగు పడ్డాయని అన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలని,ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలని, యువత చెడు మార్గాల వైపు మరలకుండా వారితో మమేకమై కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున నిర్వహిస్తామన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఒక మంచి లక్ష్యం తో ప్రయత్నం చేసినప్పుడు తప్పక విజయం సాధిస్తాము అన్నారు. అదేవిదంగా యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని,క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరుపున యువతకు ఎల్లవేళలా సహకరించి,ప్రోత్సహిస్తామని అన్నారు.యువకులు గంజాయి, మద్యం,జూదం వంటి చెడు వ్యసనాలకు,ఇతర చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉద్యోగాలు సంపాదించి,తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి,జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని సీపీ ఆకాంక్షించారు. గ్రామంలో ఒక్కరికి ఉద్యోగం వస్తే గ్రామంలో పది మంది తన వెంట వస్తారని అన్నారు.అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారు ళకావున వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు.ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు అసాంఘిక శక్తులకు దూరముగా ఉండాలని,గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన, పోలిసులకు తెలియచేయాలని అన్నారు.సీపీ కార్యక్రమం కు హాజరైన యువకులతో చెడు అలవాట్లకు,చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటామని,సత్ప్రవర్తన తో అనుకున్న లక్ష్యం ను సాధిస్తామని ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. అనంతరం సీపీ గారి చేతుల మీదుగా కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల యూత్ కు వాలీబాల్, క్రికెట్ కిట్స్, జెర్సీ లను పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డి సి పి అశోక్ కుమార్ ఐపిఎస్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్,ఎన్ ఐ బీఇన్స్పెక్టర్ శ్రీనివాస్,కోటపల్లి ఎస్సై రాజేందర్,నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్,యువకులు పాల్గొన్నారు.