ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కొత్త కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ ఆగష్టు 22 ;హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలక్షన్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఆగస్టు 30 వ తేదీ న రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా శాఖా కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు 21.08.2023 వ తేదీ న విడుదల చేశారు. ఈ ఫలితాల లో మామిడి భీమ్ రెడ్డి గారి ప్యానల్ 15 మంది సభ్యులు విజయo సాధించారు. రెడ్ క్రాస్ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సేవా విభాగం లో రాష్ట్రపతి బంగారు పతాక గ్రహీత, రెడ్ క్రాస్ ముద్దు బిడ్డ మామిడి భీమ్ రెడ్డి వరుసగా మూడవ సారి బారి మెజారిటీ తో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా శాఖా చైర్మన్ పదవిని చేపట్టాడు. ఈ కమిటీ నిర్మాణం..మామిడి భీమ్ రెడ్డి – చైర్మన్,విజయ కుమారి – వైస్ చైర్మన్,పురుషోత్తం-ట్రెజరర్, ఒ.యస్.రెడ్డి స్టేట్ యం.సి, జై వీర్ సింగ్, సందేశ్, పల్లే వీరమణి, అబ్దుల్ నహీమ్ @ సద్ధాం, వినయ్ కిశోర్, ఎ. వి రావు గారు, అరికపూడి. రఘు, అభిషేక్, కే. నాగేందర్, పాశం జ్యోతి, సార ప్రసన్న రాణి, భీమ్ రెడ్డి నాయకత్వంలో 15 మంది సభ్యులు ఈ ఎన్నికల ఫలితాలు లో విజయమo సాదించారు. విజయం సాధించిన అనంతరం రెడ్ క్రాస్ బాలికల పాఠశాల,మాసబ్ ట్యాంక్ లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఇ.వెంకటాచార్యులు మరియు ఎలక్షన్ ఆఫీసర్ ఎ. పద్మ గారు విచ్చేసి ఎన్నికైన నూతన కార్య నిర్వహణ కమిటీ సభ్యులు చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్. మాల్యాద్రీ హజారై ఎన్నికైన సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రెడ్ క్రాస్ కార్యక్రమాలు ను భవిష్యత్తులో ముందుకు తీసుకెల్లి రాష్ట్రం నలుమూలల కు విస్తరి చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్ భాస్కర్ గౌడ్, ప్రొఫెసర్. బాలకిషన్, మేడ్చల్ స్టేట్ యం. సి రమేష్, సంగారెడ్డి చైర్మన్ వనజ రెడ్డి, టి. జి. ఓ ప్రెసిడెంట్ కృష్ణా యాదవ్ మరియు సమ్మయ్య రెడ్ క్రాస్ సభ్యులు, వాలంటీర్లు, శ్రేయోభిలాషు లు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking