వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం అమెరికా వెళ్లనుంది.
ఈ నెల 27 నుండి సెప్టెంబరు 3 వరకు పర్యటన బృందం అమెరికా లో పర్యటించనుంది.
29 నుండి 31 వరకు ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగే ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు హాజరు కానుంది.
అమెరికాలో ప్రముఖ వ్యవసాయిక రాష్ట్రం లోవా,నార్త్ కరోలినా, వాషింగ్టన్ డీసీలో క్షేత్రస్థాయి పర్యటన వుంటుంది.
అమెరికా ఫెడరల్ వ్యవసాయ శాఖ కార్యదర్శి,అమెరికా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో బృందం భేటీ అవుతుంది.
ఆధునిక సాంకేతికత, ఆహార రంగ పరిశ్రమలు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం తదితర అంశాలపై బృందం అధ్యయనం చేస్తుంది.
ఈ అధ్యయనం తెలంగాణ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేయనుంది.
భవిష్యత్ లో ఆహార పరిశ్రమలతో రైతులకు వ్యవసాయం మరింత లాభసాటి చేసే యోచనలో ప్రభుత్వం వుంది.ఈ బృందం పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.