ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 23 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి దండేపల్లి మండలం లోని పెద్దయ్య దేవున్ని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దర్శాంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గురువారం దండేపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు దండేపల్లి మండల కేంద్రంలో పొన్నం ప్రభాకర్ కి స్వాగతం పలికి తన వెంట వెళ్ళినారు.ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న మహిమాన్వితమైన పెద్దయ్య దేవున్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా వుంది అని అన్నారు,ఈ ఆలయ ప్రాంతంలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి అని అన్నారు,ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి,ఎంపీటీసీ లు బొడ్డు కమలాకర్,కొంగల నవీన్, నాయకులు బత్తుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.