NSUI నిన్న శాసనసభ లో గవర్నర్ ప్రసంగం చర్చ వేదికలో నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారు మాట్లాడుతూ ఉన్నపుడు జగదీశ్వర్ రెడ్డి గారు వ్యంగంగా మాట్లాడుతూ, హేళన చేయడం సబబు కాదు అని NSUI రాష్ట్ర నాయకులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ అన్నారు. నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ, శాసనసభలో ఒక దళిత ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నపుడు BRS ఎమ్మెల్యే లు అవమానించే విధంగా ప్రవర్తించడం సభ నియమాలను ఉల్లంఫించే చర్యలు అని వారు తెలిపారు.. జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకా జిల్లా మంత్రివర్యులు గా అహంకారం తో మాట్లాడుతున్నారు అని, నీవు ఎమ్మెల్యే గా స్వల్ప మెజారిటీ తో గెలిచావు, కానీ మా ఎమ్మెల్యే తెలంగాణ లో భారీ మెజారిటీ తో గెలవడం జరిగింది అని, నల్గొండ జిల్లా ప్రజలు నీకు అహంకారం వల్ల మొన్న జరిగిన ఎన్నికలో సరియైన సమాధానం ఇచ్చారు అది మరచిపోవద్దు, నల్గొండ ఫిబ్రవరి 13వ తేదీన సభ ఎందుకు పెడుతున్నారో జిల్లా ప్రజలకు తెలియజేయాలి అని వారు తెలిపారు.KRMB ద్వారా ప్రాజెక్ట్ లను కేంద్ర ప్రభుత్వం కి అప్పగించింది మీ ప్రభుత్వం అయంలో జరిగింది.. KRMB విషయం ను అడ్డు పెట్టుకొని మోసపురితమైన మాటలు చెప్పి లోకసభ ఎన్నికలు లాభం కోసం తప్పే నల్గొండ జిల్లా రైతులకు లాభం చేకూరేది ఏమి లేదు అని,2014లో KRMB మీ ప్రభుత్వం లోనే కదా ఏర్పాటు చేసింది.2015 సమావేశం లో కృష్ణ జలాలు మొత్తం 811TMC లలో తెలంగాణ కి 299TMC లు, ఆంధ్ర కి 512TMC లు కేటాయించినది కూడా మీ ప్రభుత్వం లోనే కదా,ఎంతవరకు అమలు చేసారో ప్రజలకు తెలియజేయాలి. అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎన్నికలలో ఓట్లు దండు కోవడం తప్ప ఇంకా ఏమిలేదు అని వారు తెలిపారు. మొన్న దాక మీ ప్రభుత్వం లో జరిగిన తప్పులు, అక్రమాలను కొత్త గా ఏర్పడిన ప్రభుత్వం పై నిందలు మోపడం సరియైనది కాదు అని, ప్రజలు నిజాలు తెలుసు అని వారు తెలిపారు..ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు జహంగీర్, జిల్లా పృద్వి, శౌర్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అంజన్ యాదవ్,, సతీష్, మధుసూదన్ పుట్ట గణేష్ రెడ్డి,వేముల సతీష్, శ్రీకాంత్, బాబా, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.