సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసు దేవ రెడ్డి.
కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 10
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్, తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, ఉత్పాదక రంగాలకు తగిన నిధులు కేటాయించలేదు.
బడ్జెట్లో జి ఎస్ డి పి పెరిగినట్టు చూపిన ఆర్థిక వృద్ధిరేటు మాత్రం తగ్గడం విచారకరం.
ముఖ్యంగా వ్యవసాయ వృద్ధిరేటు తగ్గడం, దీనికి కారణం లేటు వర్షాలు పేర్కొనడం శోచనీయం. సరైన కారణాలు చూపలేదు.
నీటి సరఫరా వాణిజ్యం గ్యాస్ విద్యుత్ రెస్టారెంట్లు రైల్వేలు హోటల్ రంగాల్లో గణనీయమైన తగ్గుదల ఉందని బడ్జెట్లో పేర్కొనడం ఆలోచించదగింది.
6 గ్యారంటీలో అమలుకై నిధుల కేటాయింపులు అర కొరగానే చేశారు. ఇలా అయితే ఆరు గ్యారెంటీలు అమలు అటకెక్కే పరిస్థితి ఉంటుంది. కేవలం 53,196 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు.
ఎన్నికలకు ముందు వివిధ రకాల డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించలేదు.
2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి నిధులు కేటాయింపులు లేవు. ఎప్పుడు మాఫీ అవుతుందో తెలియదు. రబీ సీజన్ రైతుబంధు డబ్బులు ఇంకా రైతులకు అందజేయలేదు. కేవలం వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు కేటాయించారు. వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. కేవలం 11500 కోట్లు మాత్రమే కేటాయించారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల పర్మినెంట్ వుసే లేదు.
ఎన్నో ఆశలతో ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలకు నిరాశే ఎదురైంది.