ఖమ్మం ప్రతినిధి జూన్ 18 (ప్రజాబలం) హైదరాబాద్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా అత్యధిక మెజారిటీ తో గెలుపొందిన రామసహాయం రఘురాం రెడ్డి ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో మొదటి అత్యధిక మెజారిటీ తన కుమారుడు రఘువీర్ రెడ్డి కి రాగా, రెండో అత్యధిక మెజారిటీ ఆర్ఆర్ఆర్ కి రావడం గర్వించదగిన విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కుటుంబం ఆర్ఆర్ఆర్ కుటుంబం అని జానారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ , జానా రెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు