నీట్ యూజీ 2024, పరీక్ష నిర్వహణ ఫలితాలు విడుదల , అవకతవకల పై లోతుగా విచారణ జరిపీ ,మళ్ళీ పరీక్ష నిర్వహించాలి

…పి,డి,ఎస్,యు జిల్లా అధ్యక్షులు ఎం సురేష్,

సంగారెడ్డి జూన్ 18 ప్రజాబలం ప్రతినిధి: స్థానిక ఐబి వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది దేశ వ్యాప్తంగా మే 5 న నిర్వహించిన నీట్ యూజీ 2024, (మెడికల్) పరీక్ష , ఫలితాల విడుదల పై అనేక అనుమానాలు, సందేహాలు కల్గుతున్నాయి, ధర్నా అనంతరం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ మాట్లాడుతూ
దేశం మొత్తం 24 లక్షల మంది విద్యార్థులు వైద్య విద్య (MBBS, BDS) ప్రవేశం కోసం పరీక్ష రాయడం జరిగింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎ న్టీ ఎ) ఆధ్వర్యంలో నిర్వహించారు, కానీ ఈ పలితాల్లో 62 మంది విద్యార్థుల కు 720/720, మార్కులు రావటం, ఒకే సెంటర్ లో పరీక్ష రాసిన 8 మoది కి 720, మార్కులు రావటం వారి హాల్ టికెట్ నెంబర్లు ఒకే సీరియల్ ఉండటం, గ్రేస్ మార్కుల కేటాయించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది,
దేశ చరిత్ర లో 67 మంది కి ఒకే ర్యాంక్ రావటం ,పరీక్ష ఫలితాలు జూన్ 14న ప్రకటించాల్సిన ఉంది కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజున నీటి ఫలితాలు ప్రకటించడం బలమైన అనుమానాలకు తావునిస్తున్నాయి.
పరీక్ష నిర్వహం కంటే రెండు రోజుల ముందు గుజరాత్ కేంద్రం గా ఒక కన్సల్టెన్సీ ఒక్కొక్క విద్యార్థికి పది లక్షలు చొప్పున తీసుకుని నీట్ పేపర్ లీక్ అయిందని వార్తలు వచ్చాయి
ఈ రకమైన అనుమానాలు విద్యార్థుల మెదడులో బలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్ష నిర్వహణ ఫలితాల విడుదల లోతైన విచారణ జరిపి వాస్తవాలు బయటకు తీసి ఎ న్టీ ఎ ను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని *ప్రగతి శీల ప్రజా స్వామ్య విద్యార్థి సంఘం (PDSU) గా డిమాండ్ చేస్తున్నాము, ఎ న్టీ ఎ బాధ్యత రాహిత్యం తో నిర్వహణ సరిగా లేదు,
వైద్య విద్యా ఎంపిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల కె ఉండాలి, అప్పుడే పకడ్బందీగా పరీక్ష లనిర్వహణ ఉంటుంది, అ విధానం వైపు కేంద్రం ఆలోచించాలి అని కోరుతు
వెంటనే ఎ న్టీ ఎ ను రద్దు చేయాలని డేమాండ్ చేస్తున్నాo, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సంసిద్ధమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు సందీప్ జిల్లా నాయకులు అర్జున్, శివ, సిద్ధార్థ్ ,సామి, ఆకాష్, రాజు ,తదితరులు పాల్గొన్నారు,

Leave A Reply

Your email address will not be published.

Breaking