మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు
ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 19
భారతదేశ మాజీ తొలి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ 107 వ జయంతి కార్యక్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండలంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉక్కు మహిళ వీర వనిత గరీబ్ హటావో నినాదంతో పేదరికాన్ని తొలగించి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పిలుపునిచ్చి అన్ని రంగాల అభ్యున్నతికి కృషి చేశారు అన్నారు. ఇందిరమ్మ ఇప్పటికీ పేదల సంక్షేమ సిద్ధాంతం ఆమెనే స్ఫూర్తిదాయకం బ్యాంకుల జాతీయకరణ భూ సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండలం లోని 18 గ్రామాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.