ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి20:
నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ షుగరు టెస్టులు రెగ్యులర్గా చేయించుకోవాలని ప్రముఖ డయాబెటిస్ స్పెషలిస్ట్ సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజిత్ మహమ్మద్ ప్రజలకు సూచించారు. ఆధునిక సమాజంలో మారిన జీవన శైలికి చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో సోమవారం సంరక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ సెంటర్ ను కాశిబుగ్గ ఓ సిటీ రోడ్డుకు వెళ్లే జంక్షన్ లో ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ లో 132 మంది స్త్రీ పురుషులకు, ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 45 మందికి కొత్తవారికి మధుమోహం, రక్తపోటుగా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్ల వలన మధుమోహ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుందని తీసుకునే ఆహారం పట్ల ప్రజలు శ్రద్ధ వహించడంతోపాటు శారీరక శ్రమను చేయాలని తద్వారా మధుమోహం బారిన పడుకుంటా ఉంటారని అన్నారు. ఈ క్యాంపులో ఆయనతో పాటు డాక్టర్ పర్వీన్ మినాజ్ బేగం, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.