బామ్మలతో చిరుధాన్యాల వంటకాలు

 

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి20:

పూర్వకాలంలో భామ్మలు చిరుధాన్యాలతో చేసిన వంటకాలు ఎంతో పోషక విలువలతో కూడినవని ఉర్సు సెక్టార్ ఐసిడిఎస్ వరంగల్ ప్రాజెక్టు సూపర్వైజర్ బత్తిని రమాదేవి అన్నారు.
41వ డివిజన్ శంభునిపేట 2 అంగన్వాడి కేంద్రంలో ఆమె ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళల కోసం చిరుధాన్యాలతో కూడిన పోషక ఆహారాన్ని బామ్మలు ఎలా తయారు చేసేవారో అలా బామ్మల చేతుల మీదుగా వంటలు వండించడంతోపాటు పోషణ పక్వడ అవగాహన కోసం హ్యాండ్ వాష్ స్టెప్స్, సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ. పూర్వము బామ్మలు అమ్మమ్మలు చేసిన వంటకాల గురించి వివరిస్తూ తాటి బెల్లంతో రాగి జావా, నువ్వులు, కొర్రలు, సజ్జలతో వంటకాలు చేయించడం జరిగేవని పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత కూడా పాటించడము చాలా ముఖ్యమని ఆమె తెలిపారు. మహిళల ఎత్తు, బాలికలు రక్తహీనతకు గురికాకుండా, ఆహార నియమాలు పాటించాలని,అందరూ ప్లాస్టిక్ నివారణకు కట్టుబడి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ప్రమీల, మమత, సుజాత సుభాషిణి శాంత కుమారి, స్వర్ణలత, ఆయాలు ఏఎల్ఎంసీ కమిటీ సభ్యులు, డ్వాక్రా గ్రూపు మహిళలు,ఏ
ఎన్ఎం. ఆశాలు, పిల్లల తల్లిదండ్రులు,తల్లులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking