ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 01 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని బిజెపి మండల పార్టీ కార్యాలయం వద్ద రఘునాథ్ వెరబెల్లి ట్రస్టు ద్వారా పవన్ ఆప్టికల్ సౌజన్యంతో దండేపల్లి మండలంలోని పేద ప్రజల కొరకు ఉచిత కంటి పరీక్ష చేసి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి ఉచితంగా ఆపిరేషన్ చేయడానికి ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుంది. శనివారం బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీర హరినాయ అదే విధంగా మండల ప్రధాన కార్యదర్శులు బందెల రవి గౌడ్,వెంబడి సురేందర్,మండల ఇన్చార్జి గుండా ప్రభాకర్,గూడెం టి ఎస్ చైర్మన్ బెడద సురేష్,లింగాపూర్ ఎంపీటీసీ బోడా నర్సింగ్ నాయక్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ఎర్ర నరేష్,మహిళా మోర్చ అధ్యక్షురాలు అక్కల దివ్య, బీసీ మోర్చ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్,మండల ఉపాధ్యక్షులు బండే సత్యం, పతివక సంతోష్,గోపే రాయమల్లు,మాజీ వైస్ ఎంపీపీ చిట్ల శ్రీనివాస్,ముత్తినేని మల్లేష్,మోర్పుటాల తులసి, బూత్ అధ్యక్షులు గుండ రవీందర్,పంచెర్పల సత్యం, గంగాధరి వెంకటేష్,ఎంబడి దిలీప్,బండారి ప్రవీణ్,చిట్ల లక్ష్మెన్,కర్ణల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.