ఖమ్మం ప్రతినిధి జనవరి 10 (ప్రజాబలం)ఖమ్మం జిల్లా రఘునాథ్ పాలెం మండలం శివయ్య గూడెంపువ్వాడ ఉదయ్ నగర్ గ్రామపంచాయతీ ప్రాంతం నందు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సారధ్యంతో గ్రేస్ సర్వీస్ సొసైటీ ఖమ్మం వారి ఆధ్వర్యంలో పాస్టర్ లేగల జీవరత్నం అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరాని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రఘునాధపాలెం మండలం రూరల్ ఎమ్మార్వో పాల్సన్ స్టీఫెన్ పాల్గొని రుబ్బను కట్ చేసి ప్రారంభించి పర్యవేక్షించారు . మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా చాతి , గర్భాశయ , బిపి , షుగర్ , ఎక్సరే , క్యాన్సర్ , నోటి కి సంబంధించిన పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు . అనంతరం వచ్చిన అతిథులను శాలువతో ఘనంగా సత్కరించారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత – రవి , ఎస్ కే సిద్ధిక్ , ఎం.తిమోతి , మంద సంజీవరావు , జయరాజు , ఎర్నస్టుపాల్ , లాజర్ , సురేష్ , జోషప్ నాయక్ , వెగ్గలం రాధ కృష్ణ మరియు డాక్టర్ జన్ను సంజీవరావు ఎంబిబిఎస్ , సీనియర్ ఫిజిషియన్ గ్రేస్ జనరల్ హాస్పిటల్ తనికెళ్ళ డా” విక్టోరియా మరినేని తదితరులు పాల్గొన్నారు . సుమారుగా 350 మందికి దాకా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకుని విజయవంతం చేశారు .