ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్ సహకారంతో విద్యార్థులకు టై, ఐడి కార్డ్స్, బుక్సు బెల్టులు పంపిణీ. హాజరైన ప్రభుత్వ అధికారులు.
మెదక్ తూప్రాన్ జనవరి 10 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా మల్కాపూర్
జిల్లా పరిషత్
ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తన సొంత ఖర్చులతో బూట్లు, ఐడి కార్డ్స్, టై ,బెల్టులను గ్రామ ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అందించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి
రాధా కిషన్,
ఎస్సై శివానందం, ఎంఈఓ బుచ్చా నాయక్ లు పేర్కొన్నారు.
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు, ఐడి కార్డ్స్, బుక్స్ , పెన్సిల్, పెన్నులను
టై, బెల్టులను తన చేతుల మీదుగా అందజేయడం చేయడం సంతోషంగా ఉందని డీఈవో పేర్కొన్నారు. మంచి మనసుతో గ్రామ ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్ విద్యార్థులకు వాటిని అందించడం వెలకట్టలేనిది అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తెచ్చినప్పుడే వీటి సార్థకత ఉంటుందని విద్యార్థులకు ఆయన ఇతవు పలికారు. అనంతరం ఎంఈఓ బుచ్చియా నాయక్, ఎస్సై శివానందం, మండల నోడల్ అధికారి సత్యనారాయణ, ఇస్లాంపూర్ హెచ్ఎం సత్యం, మల్కాపూర్ హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మన్నేమహాదేవి నవీన్ యాదవ్, ఎస్ఎంసి చైర్మన్ స్వామిలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, అలాగే తల్లిదండ్రులను, గురువులను, అలాగే దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు. ఏదో ఒకటి సాధించాలనే గోలును విద్యార్థి దశలోనే ఏర్పరచుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సేవలందించాలనే మానవత దృక్పథంతో ముందుకొచ్చిన దాత ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ను ప్రత్యేకంగా వారు అభినందించారు.
అనంతరం దాత ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే తపనతో తన వంతు సహాయంగా పాఠశాల విద్యార్థులకు చేయూతనందించినట్లు పేర్కొన్నారు. పెద్దల ఆశీస్సులతో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, ఏ ఎం ఓ సుదర్శన మూర్తి, ఎస్సై శివానందం,ఎంఈఓ బుచ్చ నాయక్ గ్రామ సర్పంచ్ మన్నేమహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, గెస్ట్ ఆఫీసర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మధుమోహన్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు మహేందర్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ స్వామి, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, ఉపాధ్యాయులు, మేకిన్ యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.