ఉచిత మెగా వైద్య శిబిరం

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి 6:

చక్కెర వ్యాధిగ్రస్తులకు సంరక్ష ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అజిత్ మహమ్మద్ పర్యవేక్షణలో సంరక్ష ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత చెక్కర వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
వరంగల్ బస్ స్టేషన్ వద్ద, నిర్వహించిన చక్కెర వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్ధారణ ను ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ క్యాంప్ లో 112 మంది స్త్రీ పురుషులకు ఉచితంగా రక్త పరీక్షలు చేసి వైద్య సేవలందించారు.
సంరక్ష హాస్పిటల్ వారి చే వరంగల్ లో 21 చోట్ల , వేరువేరు తేదీలలో “ఉచిత డయాబెటిక్ (మధుమేహ ) స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు పేర్కొన్నారు. ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపు లలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం విజయవంతంగా డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.
ఉచిత డయాబెటిక్ క్యాంపు లో సంరక్ష హాస్పిటల్ ,డైరెక్టర్ డాక్టర్ పోలా నటరాజ్ , డాక్టర్ వి. మోహన్ రావు , డాక్టర్ రవీందర్ తదితరులు క్యాంపులో పాల్గొని వైద్య సేవలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking