మెదక్ ప్రాజబలం డిసెంబర్ 12 న్యూస్ :-
మహాలక్ష్మి పథకం తో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పై స్థానిక కలెక్టర్ కార్యలయం లోనీ, కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ రాజర్షి షా, ఆర్టీసీ DM సుధ , ఆర్టీసీ అధికారులతో మంగళ వారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్ధిక స్వావలంబన , మహిళలకు రక్షణ కల్పించబడుతుందని , జిల్లా వ్యాప్తంగా మహిళ లోకం నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.
విద్యార్థులకు , మహిళల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.
మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని,మహాలక్ష్మి పథకం ప్రారంభం రోజు అనగా 9-12-23 రోజున మెదక్ డీపో లో 9,548 మంది మహిళ ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు .
మరుసటి రోజు అనగా 10-12-2023 రోజునా 22,566 మంది మహిళ ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు.
11-12-2023 నాడు 40,698 మంది మహిళ ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు అని తెలిపారు.
నర్సాపూర్ డిపో లో 9-12-2023 రోజు 3,634 మంది, 10-12-2023 రోజున 9,604 మంది మహిళ ప్రయాణికులు,11-12-2023 రోజున 13, 721 మంది మహిళ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించానీ తెలిపారు.
ఈ కార్యక్రమం లో మెదక్ mro శ్రీనివాస్,మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్ , తదితరులు పాల్గొన్నారు.
బస్ డిపో లో సౌచలయలను పరిశుభ్రం గా ఉంచాలి .
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
మెదక్ నియోజక వర్గంలో నీ బస్ డిపో లో మరుగు దొడ్లు ను, బస్ డిపో చుట్టూ పరిసరాలు పరిశుభ్రం గా ఉంచాలని,ఆరుబయట మూత్ర విసర్జన చేసే వారికి ఫైన్ వేయాలని
మెదక్ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలిచ్చారు .
మరుగు దొడ్ల లో పరిశుభ్రత పాటించడం అవసరం అని తెలిపారు ,బస్ డిపో చుట్టూ వైపులా ఉన్న హొటల్ యజమానులు వారి వారి హొటల్ లోకి వచ్చే కస్టమర్ లకు వారి హోటల్స్ లోనే సౌచలయలు ఏర్పాటు చేయాలన్నారు. హోటల్ యజమానులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
