ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 12 (ప్రజాబలం) ఖమ్మం పట్టణ స్తంభాద్రి పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మమత హాస్పిటల్ రోడ్డు గొల్లగూడెం చెరుకూరి మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లో పౌరోహిత బ్రాహ్మణ కుటుంబాలు సకుటుంబ సపరివార సమేతంగా సుమారుగా 600 మందిని పాల్గొన్నారు . ఈ కార్యక్రమం అధ్యక్షుడు మారుతీ వీరభద్ర ప్రసాద్ శర్మ , కార్యదర్శి అవధానుల కృష్ణశాస్త్రి , కోశాధికారి రంగాఉతుల దిలీప్ శర్మ మరియు కార్యవర్గ సభ్యులు సహాయ కార్యదర్శి జిలుగుల సతీష్ శర్మ , ముళ్ళపూడి గిరి శర్మ ఉపాధ్యక్షులు సరస్వతీభట్ల శ్రీధర్ శర్మ మరియు ఖమ్మం పట్టణ ప్రముఖ పురోహితులు పెద్దలు ఎడవెల్లి సత్యనారాయణ, సులసా దుర్గాప్రసాద్ శర్మ , అవధానుల రామ్మోహన్ శర్మ , అవధానుల మహదేవ్ శర్మ , ఐతపు శ్రీనివాస్ శర్మ , అవదానుల రవి శర్మ , అనిల్ శర్మ , తుంగతుర్తి యుగంధర్ శర్మ , అన్నా వజ్జుల ప్రసాద్ శర్మ , కొనకండి సాయిరాం శర్మ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు . ముందుగా కార్తీక మాసం పురస్కరించుకొని గణపతి పూజ శ్రీ లక్ష్మీ దాత్రి సమేత లక్ష్మీనారాయణ కార్తిక దామోదర పూజ వేద స్వస్తి ఆశీర్వచనము అన్నప్రసాధన మరియు ప్రముఖులకు సన్మానాలు నిర్వహించడం జరిగింది . మరియు పురోహిత సంఘం గుర్తింపు ఐడెంటి కార్డు ఇవ్వడం జరిగింది .