స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య భూ సమస్య పరిష్కారం

సిద్దాపూర్ గ్రామం 267 సర్వేనెంబర్ లో మొగులయ్య గౌడ్ కు 10 ఎకరాల భూ కేటాయింపు
సంగారెడ్డి ఆగష్టు 15;ఎట్ట కేలకు స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య భూ సమస్య పరిష్కారమయింది. కోవూరి మొగులయ్య 10 ఎకరాల భూ సమస్యను పరిష్కరించినట్లు సంగారెడ్డి జిల్లా, ప్రజావాణి కలెక్టర్ కార్యాలయం వెలువరించింది. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం, సిద్దాపూర్ గ్రామం 267 సర్వేనెంబర్ లో స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్య గౌడ్ G.O.M.S.NO:1110, Revenue, Dated 26-5-1960 ప్రకారం కేటాయించిన పది ఎకరాల భూమి సమస్య యొక్క సంబంధిత ఆధారాలను, ప్రజా ప్రతినిధుల మరియు అన్ని పార్టీల సంపూర్ణ ఏకగ్రీవ మద్దతును పరిశీలనలోకి తీసుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి సిబ్బంది సదాశివపేట తాసిల్దార్ సరస్వతి స్వతంత్ర సమరయోధుడి సిద్దాపూర్ గ్రామంలో, సర్వే నంబర్ 267 లో కేటాయించి కబ్జా ఇప్పించిన 10 ఎకరాల పంచినామా రిపోర్టును త్వరగా ఇచ్చి ధరణిలో చేర్చి పట్టా పాస్ బుక్కులు మంజూరు చేయాలని ప్రజావాణి నుండి ప్రత్యేకంగా స్వతంత్ర సమరయోధుడు పట్ల గౌరవంతో సదాశివపేట తహసిల్దార్ గారికి ఫోన్ చేసి తెలియజేశారు. తదనంతరం స్వతంత్ర సమరయోధుడి తనయుడు ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రం సాధించుకున్నాక మనకు ఎంత సంతోషం ఏర్పడుతుందో అంతే సంతోషం ఈరోజు స్వతంత్ర సమరయోధుడు సమస్యను ప్రజావాణి కార్యాలయం సంగారెడ్డి పరిష్కరించడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. అందుకు సహకరించిన సదాశివపేట పట్టణ ప్రజాప్రతినిధులు, సంగారెడ్డి జిల్లాకాంగ్రెస్ పార్టీ తీర్మాన పత్రం, భారతీయ జనతా పార్టీ తీర్మాన పత్రం, బహుజన్ సమాజ్ పార్టీ తీర్మాన పత్రం, కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు, అధికార పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు మరియు గ్రాడ్యుయేట్ ఫారం పట్టా బద్రులు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కార్యాలయం నుండి ఢిల్లీ కార్యాలయం వరకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు ,కేంద్ర మంత్రులు , రాష్ట్ర మంత్రులు అని కొడియాడుతూ అందరికీ పేరుపేరునా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి విషయంలో సదాశివపేట తాసిల్దార్ కార్యాలయం ఆర్.ఐ గణేష్ కేతావత్ పంచినామా రిపోర్ట్ ఇవ్వడంలో ప్రత్యేకమైన చోరవతో నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని గత ఆరు నెలల నుండి ధరణిలో చేరుస్తామని మభ్యపెడుతూ సమయాన్ని వృధా చేస్తున్నాడని ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజావాణి కార్యాలయం ద్వారా మరియు విజయానికి తోడ్పడ్డ అందరికీ సదాశివపేట తహసిల్దార్ ఆర్.ఐ గణేష్ కేతావత్ గారి ప్రవర్తనను ఈ ప్రజానీకానికి మరియు ఈ విజయానికి తోడ్పడ్డ అందరికీ తెలియజేయుటకు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి సంగప్ప గౌడ్, మెదక్ జిల్లా గౌడ సంఘం చైర్మన్ సాయన్న గౌడ్, సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం నాయకులు గొల్లగూడెం శంకర్ గౌడ్,కరాటే మాస్టర్ అశోక్, పులి సాయి కిరణ్ గౌడ్, జయరాజ్,కే.గోపాల్,సంధ్య మరియు స్వతంత్ర సమరయోధుడి ఆశయాల సాధన సమితి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking