ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 15 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట అగ్రి ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక ఉత్కూర్ చౌరస్తా వద్ద జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా అగ్రి ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పని ప్రదీప్ మాట్లాడుతూ…భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుందన్నారు. మఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా భారతదేశాని స్వాతంత్రము వచ్చింది అని అన్నారు.వారి త్యాగాలను వెలకట్టలేమని, ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో నడవాలని తెలిపారు.ఈ వేడుకల్లో నేల్కి శంకర్,బానేష్,కలాల రమేష్,గాజుల రామన్న,టెర్ర శ్రీనివాస్,కోక్కిస శ్రీనివాస్, కోన రవి,బుచ్చన్న,నంది తిరుపతి,చీకటి తిరుపతి, చెరుకు వేణుగోపాల్, సురేష్,సతీష్,వెంకటేష్,ఎస్ వేణుగోపాల్,కుమార్, శ్రీనివాస్,గొర్ల సుధాకర్,అత్తె సుధాకార్,పెండం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు