ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 15 (ప్రజాబలం) ఖమ్మం నూతన కలెక్టరేట్ లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు జిల్లా అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం ఏ దేశానికి అయిన ఒక మైలురాయి లాంటిదని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు మన దేశం ఆదర్శంగా ఉందని ఆయన తెలిపారు. 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన, సోషల్, ఎకనామిక్ స్వేచ్ఛ అనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. పథకాల అమలులో అధికారులది కీలకపాత్ర అని, ఏ స్పూర్తితో చట్టాలు, పథకాలు తెస్తున్నారో, అదే స్ఫూర్తితో క్షేత్ర స్థాయిలో అమలుచేసి, ప్రభుత్వ ఫలాలు అర్హులు పొందేలా కృషి చేయాలన్నారు.
అంతకుముందు క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డి. మధుసూదన్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.