ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ నారాయణ
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 15 (ప్రజాబలం) ఖమ్మం
టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) నాయకత్వంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ వద్ద మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, యూనియన్ నగర కమిటీ అధ్యక్షులు మైస పాపారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి కే రామ్ నారాయణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం లభించి ఏడు దశాబ్దాలు పూర్తవుతున్నప్పటికీ స్వాతంత్ర్య ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందడం లేదని పేర్కొన్నారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు అంతగా శ్రద్ధ పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు. యూనియన్ రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, మీడియా ప్రతినిధులు నలజాల వెంకటరావు , మహేందర్, యూనియన్ జాతీయ కమిటీ సభ్యులు సామినేని మురారి, రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్ , తాళ్లూరి మురళీకృష్ణ, ఖమ్మం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కూరాకుల గోపి, కోశాధికారి నామ పురుషోత్తం, యూనియన్ ఖమ్మం నగర కమిటీ కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే ఐజేఐ నాయకత్వం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఐజేయు నాయకత్వంలోనే జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకలలో జిల్లా యూనియన్ నాయకులు కే వెంకటేశ్వర్లు, జనార్ధన చారి, ఎండి మోయినిద్దీన్, ఏలూరి వేణుగోపాలరావు, మేడి రమేష్, మధులత, కొమ్మినేని ప్రసాదరావు, నారాయణ రావు, సూర్య సత్యనారాయణ, గోసు నాగేశ్వరరావు, ఐ న్యూస్ నాగేశ్వరరావు, ముద్ర కళ్యాణ్, దూరదర్శన్ రమేష్, సురేష్, హోలీ, సబ్ ఎడిటర్లు, ఫోటో వీడియో జర్నలిస్టులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.