నిర్మల్ జిల్లాలో శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు బి. భారతీ లక్ పతి నాయక్

ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి.
ఓటు హక్కు పై కళాజాత చే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి
జిల్లాల వారిగా ఫామ్ 6,7,8 క్షుణ్ణంగా పరిశీలన.
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నియోజక వర్గాల వారిగా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ఫొటో ఓటరు జాబితా పై అధికారులను అడిగి తెలుసుకున్న
ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు బి. భారతీ లక్ పతి నాయక్.
స్పెషల్ సమ్మరి రివిజన్ 2024 ఫొటో ఓటరు జాబితా రూపకల్పన పై సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, అదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు బి. భారతి లక్ పతి నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు మాట్లాడుతూ అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయం తో పనిచేసి స్పష్టమైన జాబితా రూపొందించాలని 18,19 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు ఓటరు జాబితా లో తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని నూతన ఓటరు నమోదు చేసేందుకు వయస్సు నిర్ధారణ కొరకు జనవరి 1, 2024 న ప్రామాణికంగా తీసుకొన,గత నెల 22 వ తేదీ వరకు ముసాయిదా జాబితా స్వీకరించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను ఫిబ్రవరి 2 వ తేదీన పరిశీలించి ,8 వ తేదీన తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.పోలింగ్ కేంద్రా లలో 1500 మంది ఓటర్లు ఉండేలా జాబితా రూపొందించటం లో రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్లు పరిశీలించాలని , రానున్న పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని,ఓటరు నమోదు, జాబితాలో సవరణలు,మార్పులు, తొలగింపుల కొరకు దరఖాస్తులను పకడ్బందీ గా పరిశీలించాలని ఆన్నారు.జిల్లాల్లో 18 సంవత్సరాలు నిండిన వారి వివరాలు ఓటరు జాబితా లో నమోదు చేసి రు. స్పష్టమైన జాబిత రూపొందించాలని అధికారులను ఆదేశించారు.నూతన ఓటరు నమోదు, సవరణలు,మార్పులు చేర్పులు నిబంధనల మేరకు పకడ్బందిగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి స్పష్టమైన ఓటరు జాబితా ఏర్పాటు చేయాలని కోరారు.
కళా జాత ద్వారా కార్యక్రమాలు చేపట్టి విస్తృత ప్రచారం చేపట్టి ప్రజలలో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా 18 సంత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరు నమోదు చేసుకునేలా చూడాలని ఆన్నారు. ఫామ్ 7,8 లో మార్పులు చేర్పుల, తొలగింపు చర్యలు పూర్తి స్థాయిలో సవరించి 6వ తేదీన ముసాయిదా ప్రకటించడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న స్వీప్ ఆక్టివీస్, ప్రత్యేక ఓటరు జాబితా రివిజన్ పై చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల పై వివరించారు. ప్రతీ వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని , కళాశాలలో నోడల్ అధికారి నీ నియమించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అదిలాబాద్ కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో చేపడుతున్న ఫొటో ఓటరు జాబితా పై వివరించారు.
అనంతరం లంచ్ తరువాత జిల్లాల వారీగా 6,7,8 ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సమీక్షా సమావేశం లో కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా పాలనాధికారులు. హేమంత్ బోర్కడే, బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, శ్యామల దేవి, ఉమ్మడి జిల్లా నుండి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking