ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 2:
టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు, జిహెచ్ఎంసి మాజీ కో-ఆప్షన్ మెంబర్, సెయింట్ పీటర్ స్కూల్ ఫౌండర్ విద్యా స్రవంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇంచార్జీ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో విద్యా స్రవంతి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీ కండువా కప్పి దీపదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ
సీనియర్ లీడర్లు వి వి రాజ్ , రాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.