27 నుండి గీతామందిర్ 15వ వార్షికోత్సవం సందర్భంగా అహ్వాన పత్రికను తూప్రాన్ ఎస్. బి.ఐ బ్రాంచ్ మేనేజర్ శోభన్ బాబు గారికి అందజేసిన గీత మందిరం నాయకులు.

 

 

తూప్రాన్, ఫిబ్రవరి, 24 ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ స్వర్గీయ నేతి రాజయ్య గుప్త స్వాప్నిక మందిరంగా వెలసిన శ్రీ గీతామందిరంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు 15వ వార్షికోత్సవం శ్రీ మాదవానంద సరస్వతీ స్వామి పర్యవేక్షణ లో త్రయాహ్నిక దీక్షతో ద్వాదశాక్షరి జపయజ్ఞ పూర్వక తర్పణ, హోమ, అభిషేకాదులు, పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీ గీతా భక్త సమాజం వారు తెలిపారు.
ఈసందర్భంగా తూప్రాన్
ఎస్. బి.ఐ (SBI) బ్రాంచ్ మేనేజర్ శోభన్ బాబుకు గీత మందిరం వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావాలని అహ్వాన పత్రికను గీత మందిరం నాయకులు అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ
ఫిబ్రవరి 27 సోమవారం ఉదయం వేద స్వస్తి, శ్రీ విఘ్నేశ్వరుని పూజ, వరుణానయం, పుణ్యాహవచనం, గోపూజ, పంచగవ్య మేళన, ప్రాశన, రక్షాబంధనం, ఋత్విక్వర్ణన, మాతృక, నాంది, దేవతాహ్వానం, అంకురారోహణం, యోగినీ, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ సహిత సర్వతో భద్రాది దేవతా స్థాపన, ప్రధాన కలశ స్థాపన, అవాహిత స్థాపిత దేవతాపూజ, అగ్నిమధనం, కుండ సంస్కారం, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, అవాహిత స్థాపిత దేవతా హోమాలు, సాయంత్రం లఘు రుద్రం, (శత రుద్ర) అభిషేకం, రుద్రాహావనము, ప్రదోషకాల పూజ, అవదారయులు, భాగవన్నామస్మరణ, మహా మంగళహారతులు, మంత్ర పుష్పము, తీర్థప్రసాదాలు వితరణ గావించబడును. తేదీ 28 మంగళవారం ఉదయం వేద స్వస్తి, గోపూజ, అవాహితస్థాపిత దేవతాపూజ, 108 సంఖ్యగా పురుషసూక్త, లక్ష్మీ సూక్త, మన్య సూక్త, కృష్ణ ఉపనిషత్తులు, పారాయణపూర్వక 108 కళాశాల అర్చన విధానంగా 108 లీటర్ల పాలతో శ్రీ గోపాలకృష్ణ స్వామి వారికి మహాస్నవణము (అభిషేకం), 11సార్లు పురుష సూక్త, 15సార్లు లక్ష్మీ సూక్త, 14సార్లు మన్య సూక్త, 11సార్లు కృష్ణ ఉపనిషత్తు హావనములు, 12000 సార్లు ద్వాదశాక్షరీ మూల మంత్ర హావనం, సాయంత్రం లక్ష పుష్పార్చన, గీతామందిరంలో ఉన్న అన్ని దేవత మూర్తులకు 108 సార్లు సంఖ్యతో మూల మంత్ర హావనం, రుద్రాహావనము, ప్రదోషకాల పూజ, అవదారయలు, భాగవన్నామస్మరణ, మహా మంగళహారతులు, మంత్రపుష్పము, తీర్థప్రసాదాలు వితరణ చేయబడును, మార్చి 1 తేదీ బుధవారం ఉదయం వేద స్వస్తి, గోపూజ, అవాహిత స్థాపిత దేవతా పూజ, రుద్ర హావనం, నవగ్రహ హోమాలు, 1200.సార్లు ద్వాదశాక్షరీ మూల మంత్ర క్షీర తర్పణం అవాహిత స్థాపిత దేవతా సమేత దిక్పాలక, క్షేత్రపాలక ఓదన బలి ప్రసాదం. జయాదులు మహా పూర్ణాహుతి, తదుపరి శ్రీశ్రీశ్రీ రుక్మిణీ కృష్ణుల కళ్యాణం, కలశోద్వాసన, కలశోధక మార్జన, మహదాశీర్వచనం, ఋత్విక్ సన్మానం. ప్రతి రోజు శ్రీశ్రీశ్రీ మాదవానంద సరస్వతీ స్వామి వారి అనుగ్రహాభాషన, ఆశీర్వచనం, ఆశీస్సులు అందజేయబడును, ఒక ఋత్వికునిచే భగవద్గీత పారాయణము, విశేష భాగవన్నామ స్మరణతో మారుమ్రోగును, అలాగే అన్న ప్రసాద దాతలు కల్లూరి హన్మంతరావు, కొడిప్యాక నారాయణ గుప్త, ఆకుల రామకృష్ణ ల సహకారంతో మూడు రోజుల పాటు మహా అన్నదానం చేయబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ గోపాలకృష్ణ భగవంతుని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని గీతా భక్త సమాజం పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి ఉదయ్ కుమార్ శర్మ, నేతి నగేష్ గుప్త,ఉప్పల నాగరాజు, శ్రీనివాస్ గుప్తా, బాల వీరయ్య,
సిద్దిరాములు గుప్త, బుక్క విజయ్ కుమార్ గుప్త, మన్నెం ప్రవీణ్ గుప్త, గుప్త గీత మందిరం భక్తా బ్రుందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking