ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో పశు వైద్య అధికారులు క్యాంప్ నిర్వహించారు

 

మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 24
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో గొర్ల మేకలలో నట్టల నివారణకు పశు వైద్యాధికారులు క్యాంపు ఏర్పాటు చేశారు. గ్రామంలో గొర్ల కాపరుల వద్ద సుమారు 1600 గొర్లు మేకలు ఉన్నట్టు తూప్రాన్ అసిస్టెంట్ వైద్యాధికారి లింగమూర్తి తెలిపారు. వాటన్నింటికీ నట్టల మందు పంపిణీ చేస్తామని ఈ అవకాశాన్ని గొర్రె కాపరులు సద్వినిగం చేసుకోవాలని లింగమూర్తి తో పాటు గ్రామ ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్, బిఆర్ఎస్ నాయకుడు మన్నె నవీన్ యాదవ్ లు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, గోపాలమిత్ర పల్లెపాటి అశోక్, చిర్ర మానస, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking