నిండు నూరేళ్లు వర్ధిల్లాలి

 

-ఘనంగా పులిపాటి జన్మదిన వేడుకలు

-తిరుమల శ్రీవారి దర్శనంలో పులిపాటి దంపతులు

ఖమ్మం ప్రతినిధి మే 29 (ప్రజాబలం) ఖమ్మం
నిరాడంబరుడు స్నేహశీలి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పులిపాటి ప్రసాద్ జన్మదిన వేడుకలు ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన పులిపాటి పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖులు కేక్ కత్తిరించి పులిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనంలో ఉన్నప్పటికీ పులిపాటి మిత్రులు జన్మదిన వేడుకలను హృదయ పూర్వక వాతావరణంలో జరపడం గమనార్హం.కల్మషం ఎరుగని స్నేహశీలి డాక్టర్ పులిపాటి ప్రసాద్ మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని అభిలషించారు. ఇదే రోజున ఆయన సతీమణి పద్మ ప్రియ జన్మదినం కావడం విశేషం. పులిపాటి దంపతుల బర్త్ డేను పురస్కరించుకొని ఖమ్మం బైపాస్ రోడ్డు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం వస్త్ర దానం నిర్వహించారు.సేవల్లో మేటిగా చెప్పుకునే పులిపాటికి ఇష్టమైన సేవా కార్యక్రమాలను చేపట్టి ఆయన నూరేళ్లు జీవించాలని ఆత్మీయులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పులిపాటి ప్రసాద్ విద్యాసంస్థల అధ్యాపకులు మిత్రులు పౌరసమితి సభ్యులు వాసవిక్లబ్ సభ్యులు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ముకుంద సేవా ట్రస్ట్ చైర్మైన్ శ్రీమతి చెరుకూరి రాజి (రాజ్యలక్ష్మి) కావ్య హాస్పిటల్ వైద్యురాలు డా. కావ్య చంద్ యాలముడి పాల్గొని కేక్ కట్ చేసి పులిపాటి ప్రసాద్ దంపతులకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాస్పటల్ లో పేషెంట్స్ కు రైల్వే స్టేషన్ లో పేదలకు అరటి పండ్లు బ్రెడ్ పంచి పెట్టారు. వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం వస్త్ర దానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కావ్య ఖమ్మం పౌర సమితి నాయకులు షేక్ ఖాసిమ్ సతీష్ చౌదరి మజీద్ ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గోళ్ల రాదాకృష్ణ ప్రధాన కార్యదర్శి గుమ్మడవల్లి శ్రీను ఉపాధ్యక్షుడు మాశెట్టి వరప్రసాద్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కొల్లా రామారావు ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కొంకిమళ్ల మృత్యుంజయ గుప్తా తెలంగాణ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు సిద్దంశెట్టి శ్రీకాంత్, కొదుమూరి భద్రయ్య, బూర్లె పుల్లారావు పత్రికా రిపోర్టర్ సంతోష్ చక్రవర్తి పులిపాటి ప్రసాద్ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ అండ్ స్టాప్ కే రామకృష్ణ ప్రతాప్ శ్వేత అరుణ వై ఎన్ రామకృష్ణమూర్తి సతీష్ శ్రీనివాస్ ప్రవీణ్ స్వాతి ముస్తఫా ప్రవణ్య సాయి శ్రీకృష్ణవేణి పాషా సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking