ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 29 : రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రజల ప్రాణ రక్షణ కొరకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని డి.సి.సి కార్యాలయానికి చేనున్న రెస్క్యూ సామాగ్రిని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్,డి.సి.పి. ప్రకాష్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే అవకాశం ఉన్నందున జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు ప్రాణ రక్షణ కొరకు ముందస్తు అన్ని ఏర్పాటు సిద్ధంగా ఉన్నామని, వరద పరిస్థితులలో ప్రజలు సహాయార్థం ప్రత్యేక రక్షణ బృందాలను నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.