ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 30 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని దుఖానా దారులు ప్లాస్టిక్ వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ పేర్కొన్నారు.గురువారం పట్టణంలోని ఓ టీ స్టాల్ ను అయన ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ప్రజలకు ప్లాస్టిక్ గ్లాస్ లో టీ పోయడం ద్వారా అనారోగ్యం పాలవుతారని,మీ చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచు కోవాలని సూచించారు.చెత్తను రోడ్డుపై వేయ్యొద్దని,చెత్త బండిలో వేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు. మున్సిపాలిటీకి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చేలా ప్రజలు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో చింత అశోక్ కుమార్,రమణ,మల్లేష్, ప్రమోద్,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.