ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 03 : పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి కుమారుడు గడ్డం వంశీ కృష్ణ దరఖాస్తు గాంధీ భవన్ పార్టీ కార్యాలయంలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శనివారం పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను పార్టీ అధిష్టానం స్వీకరిస్తుంది.ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి కుమారుడు గడ్డం వంశీ కృష్ణ గాంధీ భవన్ లో పార్టీ కార్యాలయంలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీని ఆయన కోరారు.