ఎత్తిపోతల పథకానికి గద్దర్ పేరు గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా అప్పుడు ప్రతిపాదించిన గడప దేవేందర్ .

 

మెదక్ తూప్రాన్ ఆగస్టు 26 ప్రజాబలం న్యూస్ :-

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు దళిత నాయకుడు మన్నె శ్రీనివాస్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ
తూప్రాన్ మండలంలోని హల్దీ వాగు పై ఉన్న కిష్టాపూర్ డాం వద్ద మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ ముద్దుబిడ్డ శ్రీ గద్దర్ అన్న అలియాస్ గుమ్మడి విట్టలు.3. కోట్ల50 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన నీటి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ కు గద్దర్ పేరు పెట్టాలని తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిళ్ల జ్యోతి కృష్ణ , వైస్ చైర్మన్ శ్రీనివాస్,కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, నారాయణ గుప్తా,పల్లెర్ల రవీందర్ గుప్తా, రవీందర్ రెడ్డి,రాజు, పాలకవర్గ సభ్యులు ,
ప్రజా ప్రతినిధుల సమక్షంలో మెదక్ జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ఎత్తిపోతల పథకానికి గడప దేవేందర్ సూచించినట్లుగానే గద్దర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే పేరుతో నామకరణం చేయడానికి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఏకగ్రీవ మద్దతుతో హల్దీ వాగు పై ఉన్న కిష్టాపూర్ డ్యామ్ కి గద్దర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే పేరు నామకరణం చేశారని, తను ప్రతిపాదన చేసిన విధంగానే మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం చేసినందుకు మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే ప్రముఖ గాయకుడిగా పేరుగాంచిన గద్దర్ సొంత గ్రామమైన తూప్రాన్ ప్రజలు గద్దర్ రుణం తీర్చుకున్నట్లుగా భావించాలన్నారు.
అనంతరం రాష్ట్ర నాయకులు గడప దేవేందర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యువకులను విద్యార్థులను తెలంగాణ ప్రజలను తన ఆటపాటలతో ఉద్యమం వైపు మళ్లీ మళ్లించి, తెలంగాణ సాధించే వరకు పోరాటాన్ని కొనసాగించిన వైనం తూప్రాన్ ప్రజల కళ్ళముందు ఉందన్నారు. గద్దర్ రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా తూప్రాన్ ముద్దుబిడ్డగానే చెప్పుకోవడం తూప్రాన్ ప్రజల అదృష్టం అన్నారు. గద్దర్ పేరుతో తూప్రాన్ పట్టణానికి ఒక ప్రత్యేకమైన విశేషమైన గుర్తింపు వచ్చిందనడంలో సందేహం లేదన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ , దళిత నాయకుడు మన్నే శ్రీనివాస్ రావు మరియు దళిత నాయకులు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking