లిటిల్ స్టార్ గ్రామర్ స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 26 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని లిటిల్ స్టార్ గ్రామర్ స్కూల్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు పాఠశాల ఆవరణలో సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థినిలు గోపికలుగా,విద్యార్థులు శ్రీ కృష్ణగా వేషధారణ లో రావడం జరిగింది.కృష్ణుని వేషధారణలో వున్న విద్యార్థులు ఉట్టీ కోట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ…వేణు మాధవుడు లోకానికి గురువు.గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికీ దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా.తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు.అంతేకాదు గోప బాలకుడిగా, సోదరునిగా,అసురసంహారిగా,ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే.అందుకే కన్నయ్యను అందరు బాగా ఇష్టపడతారు.అందుకే కృష్ణాష్టమి వస్తోందంటే చాలు. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది.ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు.ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.కనుల విందుగా జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మినుములు శ్రీనివాస్,మొహమ్మద్ హమీద్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking