ప్రజాబలం ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05 : ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్ మండలంలోని సావపూర్ గ్రామంలోని డి కేశవ్ పంట సేను లో గంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ఫ్లష్ పై క్షేత్ర స్థాయిలో పరిశీలన ఎం డి ఓ ఎం.స్వామి ఆధ్వర్యంలో శనివారం రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన కంపెనీ ప్రతినిధి ఏ ఎస్ ఎం గాలి రవీందర్ పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…గంగా కావేరి సీడ్స్ ప్రై లిమిటెడ్ వారి జీ కె సూపర్ బోల్ ఫ్లష్ అనే రకం ఏపుగా పెరిగి ఎక్కువ కొమ్మలు కలిగి వుండి,పెద్ద పెద్ద కాయలతో చిక్కటి కాపుతో రసం పీల్చు పురుగుల నుండి సమర్థ వంతముగా తట్టుకోనే శక్తితో,ప్రతి కూల పరిస్థితిలోను తట్టుకోని మరల మరలా గూడపూత కాయలు వచ్చే లక్షణాలు కల్గివుంటుంది,వర్షా ధారము,నీటీపారుదల క్రింద సాగుకు అనువైనది,పెద్ద పెద్ద కాయలతో చక్కటి కాపుతో వుండటం వల్ల పత్తి తియడం సులువు,ఇలా వుండటం వల్ల రైతులకు ఎక్కువ లాభం అని తెలిపారు.ఈ కార్యక్రమానికి డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.