నేడు జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం

 

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా పరిషత్​ సీఈవో దేవసహాయం

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 22:
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 23న (మంగళవారం) జిల్లా పరిషత్​ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్​ సీఈవో దేవసహాయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలిపారు. జిల్లా పరిషత్​ ఛైర్మన్​ శరత్​ చంద్రారెడ్డి అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని సీఈవో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్​ గౌతమ్​తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని జడ్పీటీసీలు, అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని సీఈవో దేవసహాయం స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking