రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 12 జూలై 2024:
మణికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 98 శాతంతో ఉత్తీర్ణురాలైన ఏం. మిర్యామినీ వీ.ఆర్.4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారు ఆదరించి నార్సింగి లోని జాగృతి కాలేజ్ లో ఉన్నత చదువు లకై ఫీజు కట్టిన విషయం విధితమే, తదుపరి విద్యార్థిని చేసిన కృషి వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐ.ఐ.ఐ.టీ బాసరలో తెలంగాణ రాష్ట్ర వాటా క్రింద సీటు సాధించడం జరిగినదని, తీరా ప్రవేశ పత్రాలు దాఖలు చేసే సమయంలో విద్యార్థిని తండ్రి నాగేశ్వర్ రావు యొక్క కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రంలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందినవిగా ఉన్నందున కనీసం ప్రవేశ రుసుము, సేవా రుసుము తదితర అంశాలపై మొదటి సంవత్సర ఫీజులు వెంటనే చెల్లించ వలసి వచ్చినదనీ అందుకు గాను స్పందించిన మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు గతంలో తెలియజేసిన విధంగా ట్రస్టు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తుందని, ఆ దరిమల ట్రస్ట్ నిధి నుండి కొంత సొమ్మును జత చేసి ఏకమొత్తంగా కాలేజ్ ఫీజ్ కట్టడం జరిగినదని, ఇట్టి క్లిష్ట పరిస్థితులన్ని దాటుకొని రాబోయే సమయంలో ద్విగుణీకృతంగా చదువు కొనాలని విద్యార్థిని మిర్యామికి సూచిస్తూ, మనసార అభినందనలతో కూడిన ఆశీర్వదాలు తెలియ జేసిన ట్రస్ట్ సభ్యులు అందె లక్ష్మణ్ రావు, దిలీప్ కక్కడ్, నిర్మలచంద్ గోలేచ తది తరులు.
Prev Post
Next Post