ఖైరతాబాద్‌ గణేశుడినీ దర్శించుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌ వి కర్ణన్‌ దంపతులు

ఖైరతాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌, ఆగస్టు 30, 2025:
ఖైరతాబాద్‌ గణేశుడినీ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌ వి కర్ణన్‌
దంపతులు శనివారం దర్శించుకున్నారు.
69 అడుగులతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి ఆర్‌ వి కర్ణన్‌, ఐ అండ్‌ పి ఆర్‌ ప్రత్యేక కమిషనర్‌ సి.హెచ్‌.ప్రియాంక లు సంయుక్తంగా పూజలు నిర్వహించారు.
అనంతరం ఖైరతాబాద్‌ విఘ్నేశ్వరుడి వద్ద బారీకేడ్లు, క్యూలైన్‌ లు,భద్రతా ఏర్పాట్లను కమిషనర్‌ ఆర్‌ వి కర్ణన్‌ పరిశీలించారు.
రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు మహాగణపతిని దర్శించుకునేందుకు వస్తున్నందున దర్శనం సజావుగా ,వేగంగా జరిగేలా చూడాలని నిర్వాహకులను, అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking