ఆస్తికోసం నన్ను బెదిరిస్తున్నారు మాకు ప్రాణ హాని నుంచి రక్షణ కల్పించండి మహాప్రబో

 

బాధితురాలు చేకూరి నాగేంద్రమ్మ

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 15 (ప్రజాబలం) ఖమ్మం ఆస్తికోసం నన్ను బెదిరిస్తున్నారు. మాకు ప్రాణ రక్షణ కల్పించాలని ఖమ్మం నగరం విడివోస్ కాలనీ వాసి చేకూరి నాగేంద్రమ్మ (భర్త సత్యం బాబు(లేట్)) వేడుకున్నారు. నిన్న ఖమ్మం కిన్నెర హెూటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాకు శ్రీధర్ శేఖర్ అనే ఇద్దరు కుమారులు ఉ న్నారు. వారిద్దరిని మంచిగా పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించి వివాహాలు చేసినాము. నా భర్త చాలా ఏండ్లు కష్టపడి తన స్వార్జితంగా పెద్ద మొత్తంలోనే స్తిరాస్తులు కూడా బెట్టాడు. చిన్న కుమారుడికి వివాహం చేసిన కొద్ది రోజులకే అతని స్వభావంలో మార్పు వచ్చింది. అతని మామ అయిన డోర్నకల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వియ్యంకుడు జోక్యం మా కుటుంబ వ్యవహారాలలో క్రమంగా ఎక్కువయ్యింది. 2014 సం. లోనే సిరాస్తి గొడవలు సృష్టించాడు. అతను చెప్పింత ఆస్తి తన కూతురు అల్లుడు పేర్లతో నా భర్త యొక్క స్వార్జిత ఆస్తిని వ్రాసి ఇవ్వాలని నానా రకాలుగా వత్తిడి తెచ్చాడు. తర్వాత వారు ముగ్గురు కలిసి మానసిక వేదింపులకు గురి చేశారు. ఖమ్మంలో పేరున్న కొందరు పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటుకు ప్రయత్నించారు. యంయల్ పార్టీకి చెందిన నాయకుడు వంటి వారు మధ్యే మార్గంగా నా చిన్న కుమారుడికి రూ.75 కోట్ల విలువైన ఆస్తిని రాసి ఇచ్చేవిధంగా ఒప్పందం చేసినారు ఇరు పక్షాలు ఒప్పుకున్నాము. కాని కొద్ది రోజులకే అందుకు విరుధ్ధంగా మా చిన్న కుమారుడు అతని భార్య సుజాత అతని మామ కలిసి గొడవలు లేవదీశారు. అయినప్పటికీ మరి కొందరు పెద్దలు కూడా కలిసి రూ.85 కోట్ల ఆస్తి ఇచ్చే విధంగా 2023 సం. లోనే ఒప్పందం చేశారు. ఇరు పక్షాలు ఓప్పుకున్నారు. మళ్ళీ దానిని కూడా కాదని నా భర్తను అవమానకరంగా తిట్టడం బెదిరించడం కొట్టడం చేశారు. ఇవన్నీ తట్టుకోలేని నా భర్త మరణ వాగ్మూలం వ్రాసి ది.02-12-2024న వృధ్ధాప్యంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఒంటరి దానను అయి పోయాను. తర్వాత నా పెద్ద మనమడి పెండ్లి సమయంలో కూడా వచ్చి ఇదే ఆస్తి తగాదా చేసి ఆటంకపరిచి బంధు మిత్రులందరిలో అవమానించారు. ది.11-09-2025న నా చిన్న కోడలు సుజాత రైఢీల్లాగా వ్యవహరించే మరో ముగ్గురు మహిళలను పదిమంది వరకు పురుషులను తన వెంటబెట్టుకుని నా యింట్లోకి వచ్చింది. వృధ్ధురాలిని అని చూడ కుండా నా చిన్న కొడుకు తన భార్య కూడా ఏమే ఇష్టం వచ్చినట్లు బండ బూతులు తిట్టారు. ఇంట్లో అంతటా వెతికి అన్ని రకాల తాళం చెవులు తీసుకున్నారు. నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళమని బెదిరించారు. ఇప్పుడు కూడా వారంతా నా పెద్ద కుమారుడి ఇంట్లోనే ఉ న్నారు. అతన్ని కొట్టారు. లోపలి నుండి గేట్ తాళం వేసుకున్నారు. మాకు మంత్రి అండ ఉ న్నది. పోలీసులుగాని ఖమ్మంలో ఇంకెవ్వరైనా మమ్ములను ఏం చేయలేరు. ఎవరినైనా డబ్బులతోకొనేస్తాం. లేదా బెదిరిస్తాం. మాకు వంద కోట్ల ఆస్తి రాసిస్తేనే వెళ్ళిపోతాం అంటున్నారు. వీరిలో చిన్న కొడుకు కోడలు వారి బంధువులు తదితరులున్నారు. ది.12-09-2025న. నేను పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాను. అతి దగ్గర్లోనే పోలీస్ స్టేషన్ ఉన్నది. పోలీసులు అప్పుడప్పుడు వచ్చి వారిని చూసి వెళ్ళి పోతున్నారు. కాని వారిని బయటకు వెళ్ళమని చెప్పట్లేదు. ఈ నెల పదోతేదీన వచ్చిన ఈ రౌఢీ ముఠా మా పెద్ద వియ్యంకుడి మా పెద్ద కుమారుడి నా యిండ్లల్లో దూరి చేయకూడని అఘాఇత్యాలన్నీ చేస్తున్నారు. కావున తమరి అండ ఉన్నదని చెప్పుకుని వితంతు ఒంటరి వృద్ధురాలినైన నా ఇంట్లో తిష్టవేసి నాకు సంభంధంలేని వంద కోట్ల ఆస్తి రాసివ్వమని బెదిరిస్తున్న ఈ రౌఢీ ముఠాను బయటకు పంపించి నాకు వీరి నుండి ప్రాణ హాని లేకుండా నా భర్త యొక్క దుస్ధితే నాకూ రాకుండా కొంతకాలం బ్రతికేట్లు చేయగలరని మంత్రి ని కోరుతున్నాను.

Leave A Reply

Your email address will not be published.

Breaking