బీఆర్‌ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాసయాదవ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గోషామహల్ నియోజకవర్గం బేగం బజార్ మరియు జాంబాగ్ డివిజన్ లలో బీఆర్‌ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాసయాదవ్ పాదయాత్ర నిర్వహించారు.

గౌలిగూడ చెమన్ సాయిరాం పాన్ షాప్, మహారాజ్ గంజ్, దత్తాత్రేయ గల్లీ, సోనీ భవన్, కిషన్ గంజ్ నాలా, ఉస్మాన్ గంజ్, రీసలా అబ్దుల్లా పరిధిలో ప్రచారం నిర్వహించడం జరిగింది… బీఆర్‌ఎస్ కి ఓటు వేసి గెలిపిస్తే హైదరాబాద్ అభివృద్ధి బాటలో నడిపిస్తా అని తెలియజేసారు…బిఆర్‌ఎస్ గెలుస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని వారిని కోరారు.. ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించగలరని కోరారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ అభివృద్ధి కోసం చేసింది ఏమిలేదని ఎన్నికలు రాగానే మతాల పేరు మీద రెచ్చగొట్టడం గెలవాగానే ప్రజలను పట్టించుకోక పోవడం అని అన్నారు.

బీజేపీ అభ్యర్ధి మాదవిలత అదే రెచ్చగొట్టే మార్గంలో వెలుతున్నారు.ఇప్పటి వరకు గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీజేపీ కార్పోరేటర్లు బీజేపీ అయిన అబివృద్ది శూన్యం.కావున మీరు బీఆర్‌ఎస్ పార్టీ కారుగుర్తు కు ఓటు వేసి నన్ను గెలిపిస్తే హైదరాబాద్ పార్లమెంట్ నియెజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలని అభివృద్ది చేసి మీ రుణం తీర్చుకుంటాం.నాకు ఒక్క అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనీయర్ నాయకులు ఎస్.ధన్‌రాజ్ ,నరేందర్ యాదవ్ ,మహేదర్,జైసింహా ,మహిళా నేతలు, అభిమానులు పాల్గొన్నారు…