నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే 500 కోట్ల రూపాయలతో శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టాము

 

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కార్ ని అఖండ మెజార్టీతో గెలిపించండి

……రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి మే 4 ప్రజాబలం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని చౌటకూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షేట్కార్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన 6 గ్యారంటీలను, వాగ్దానాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే 500 కోట్ల రూపాయలతో శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలను స్థాపించి ఉద్యోగ , ఉపాది అవకాశాలు నిరుద్యోగ యువతకు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బలమన్నారు. కార్యకర్తలు లేనిది నాయకుడు కాలేడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చిన 5 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking