కేంద్ర మంత్రి శ్రీ రాందాస్ అతావాలేను కలిసిన స్వర్ణకార సంఘం నేతలు ముంబై (బాంద్రా) జనవరి 9 ():ముంబైలోని బాంద్రాలో సోషల్ జస్టిస్ మినిస్టర్ శ్రీ రాందాస్ అతావాలేను అఖిల భారతీయ స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి రవివర్మ ఘజియాబాద్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్ విశ్వకర్మ అఖిల భారతీయ స్వర్ణకార సంఘం సీసీ మెంబర్ సంజీవ్ వర్మ ముంబై బాంద్రాలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారతదేశంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దొంగ బంగారం నెపంతో పోలీస్ వేధింపులు ఎక్కువగా ఉన్నాయని జీవో నెంబర్ 411. 412 సరిగ్గా అమలు చేయాలని అలాగే భారతదేశంలో స్వర్ణకారుల గోల్డ్ అప్రైజర్లు అనేకమందికి కమిషన్ బేసిక్ పనిచేస్తున్నారని వారికి సరియైన పర్మనెంట్ సెక్యూరిటీ జాబు సరైన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ పై విషయాలపై త్వరలో జరగబోవు పార్లమెంట్ సెక్షన్లో స్వర్ణకార కుటుంబాల కోసం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేశారు.